సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ఇప్పటికే దళిత బంధు పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నుండే ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మొదట అన్ని జిల్లాల్లో ఉన్న దళిత కుటుంబాలలో వంద కుటుంబాలకు ఈ పథకం పది లక్షలు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇది కేవలం హుజురాబాద్ ఎన్నికల వరకే ఉంటుందని ఆ తర్వాత ఈ పథకం నీరుకారిపోతుంది అని ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దళితుల కోసం రక్షణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ మరియు లబ్ధిదారుల కమిటీ పర్యవేక్షణలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మరియమ్మ లాక్ అప్ డెత్ కేసులో పోలీసులను డిస్మిస్ చేశామని కేసీఆర్ అన్నారు. దళితులు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే వివక్షకు దూరమవుతారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: