మోస్ట్ ఫ్యాష‌న్..మోస్ట్ గ్లామ‌ర్..మోస్ట్ అటెన్ష‌న్..ఇవీ అల్లు అర్జున్ గురించి వినిపించే మాట‌లు.. ఫ్యాష‌న్..సినిమా,సినిమాకూ మారి పోతుంది..అటెన్ష‌న్ ఎంచుకునే క‌థే ఏం ట‌న్న‌ది చెబుతుంది..గ్లామ‌ర్..ఇన్ని ఉన్నాక అదొక్క‌టీ ఎందుకు త‌గ్గాలి..త‌గ్గేదేలే.. ఆయ‌న సినిమాలో ఇవ‌న్నీ ఉంటాయి..వీటికి మించి ఆయ‌న త‌ర‌హా డైలాగ్స్ మాస్ ఆడి య‌న్సుకో పండుగ..ఇన్ని కుదిరితేనే సినిమా.. ఇ న్నీ ఉన్నాక ఆగేది లేదు..ఆపేదీ లేదు..అని చెప్ప‌డం బ‌ న్నీ స్టైల్ ఆఫ్ బిహేవియ‌ర్...మెగా కాంపౌండ్ లో యంగ్ టాలెం ట్స్ కు కొద వేలేదు..వారికి కొత్తద‌నం ఉంటే చాలు కొత్త డైరెక్ట‌ర్ అయినా ఓకే..అలా గౌత‌మ్ ఈ సారి అల్లు అర్జున్ ని గైడ్ చేయ‌నున్నారు..ఇప్ప టికే జెర్సీతో మం చి పేరు తెచ్చుకున్న ఈ యంగ్ త‌రంగ్ బ‌న్నీ సినిమా కోసం స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేశార‌ని స‌మాచారం..ప్ర‌స్తుతం బీ టౌన్ లో జెర్సీ రీమేక్ లో గౌత‌మ్, పుష్ప సినిమా షూట్ లో బ‌న్నీ బిజీబిజీగా ఉన్నారు. పుష్ప రెండు భాగా లుగా తెర‌కెక్కే చిత్రం కావ‌డంతో వ‌చ్చే ఏడాది వేస‌వి త‌రువాతే బ‌న్నీ అందుబాటులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంది. సున్నిత భావోద్వేగాలతో సినిమాలు తీసే గౌత‌మ్ ఈ సారి త‌న పంథాకు గుడ్ బై చెప్పి యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ ను డిజైన్ చేశార‌ని స‌మాచారం. మొద‌టి రెండు సినిమాల‌లో ఉన్న కుటుంబ అనుబంధా లు,ప్రేమ సంబంధ భావోద్వేగాలు ఈ చిత్రంలోనూ ఉంటాయా? ఉంటే ఏ స్థాయిలో ఉంటాయి అన్న‌ది కొద్ది కాలం వేచి చూడాలి.. మ‌రో వైపు నానీ కూడా గౌత‌మ్ తో మ‌ళ్లీ ప‌నిచేసేందుకు సిద్ధం అవుతున్నాడ‌ని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: