హర్భజన్ సింగ్, నటి గీత బస్రలకు కుమారుడు జన్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సోమవారం రోజు తన కుమారుడికి నామకరణం చేసినట్టు గా హర్భజన్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. తన కుమారునికి జోవన్‌ వీర్‌ అనే పేరు పెట్టినట్టుగా హర్భజన్ సింగ్ పోస్ట్ చేశాడు. మా హీర్‌ కా వీర్‌ జోవన్‌ వీర్‌ సింగ్‌ ప్లాహా ని పరిచయం చేస్తున్నామంటూ తన కామెంట్లో తెలియజేశాడు. ఇక ఈ పోస్ట్ పై హర్భజన్ ఫ్యాన్స్ అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ స్పందిస్తున్నారు. 2016 లో హర్భజన్ సింగ్, నటి గీత బస్రలకు వివాహం కాగా వీరికి ఇప్పటికే హినాయ అనే కూతురు ఉంది. గత నెలలో మరోసారి తండ్రి అయినా హర్భజన్ సింగ్ తన పిలల్ల ఫోటోలను సైతం షేర్ చేసాడు. ఇక నటి గీత బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించగా వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: