టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న మీరాబాయి చాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది. 27 ఏళ్ల ఈ అథ్లెట్ భారత్ మాతాకీ జై అనే నినాదంతో ఇండియా గడ్డపై అడుగు పెట్టింది. అంతేకాదు మీరాబాయి చాను భారతదేశానికి టోక్యో ఒలంపిక్స్ లో మొట్టమొదటి అందించిన ఘనత దక్కించుకుంది. అలాగే గత 20 ఏళ్లలో కరణం మల్లేశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో భారత దేశానికి పథకం అందించిన చరిత్ర సైతం ఆమెకే దక్కుతుంది. మణిపూర్ కి చెందిన మీరాబాయి కి భారీ భద్రత మధ్య స్వదేశం పై అడుగు పెట్టింది. ఇక మీరాబాయి చాను భారతదేశాన్ని రజత పథకం తో తలెత్తుకునేలా చేసింది. ఇండియన్ జెర్సీ లో ఎయిర్ పోర్ట్ లోకి అడుగుపెట్టిన మీరాబాయి చాను కి ఘన స్వాగతం లభించింది ఇప్పటికే మణిపూర్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించగా, దేశం నలుమూలల నుంచి ప్రముఖులు ఆమెను ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: