కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన రాజీనామా వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత కొన్ని నెలలుగా సాగుతున్న బీజేపీ పార్టీ రాజకీయ సంక్షోభం తర్వాత యడ్యూరప్ప రాజీనామా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప బీజేపీ పార్టీ నుంచి వైదొలుగుతారా అనే ప్రశ్నకు ఆయన లేదని సమాధానం చెప్పారు. తానెప్పుడూ బీజేపీ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కర్నటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే రెండేళ్ల పాటు విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర వ్యవహారాలను పరిశీలించడానికి కేంద్రం ఒక టీమ్ ని పంపించబోతున్నట్టు సమాచారం.సరిగ్గా జూలై 26 కు బీజేపీ ప్రభుత్వం రెండేళ్ళు పూర్తిచేసుకుంది. ఇక మంగళవారం రోజు బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ బెంగళూరు కి చేరుకోబోతున్నారు. ఇక అందుతున్న సమాచారం మేరకు మరో ఇద్దరు డిప్యూటీ సీఎం లను సైతం బీజేపీ పార్టీ మార్చబోతుననట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: