ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్నా కూడా రైతులకు  ధాన్యం బకాయిలు చెల్లించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రైతులకు మేలు జరిగే వరకు ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగుతుందన్నారు దేవినేని ఉమా. రైతుల నిరసనలకు మద్దతుగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కూనపరాజు పర్వలో పొలాల్లో వరి నాట్లు వేసి నిరసన ప్రదర్శన చేశారు. రైతులకు తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఒక్క రెడ్డిగూడెం మండలంలోనే 14 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని దేవినేని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలన్నీ బోగస్ కేంద్రాలని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. దళారులు, రాజకీయ నేతలు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపంచారు


మరింత సమాచారం తెలుసుకోండి: