పోలవరం మీద ఏపీకి కేంద్రం షాక్ ఇచ్చింది. హెడ్ వర్క్ డిజైన్ల మార్పుతో పెరిగిన అదనపు వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఇక ఈ డిజైన్ల మార్పుతో హెడ్ వర్క్స్ వ్యయం రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగిందని ఏపీ ప్రభుత్వం వాపోతోంది. ఇక 2014 ఏప్రిల్ 1 నాటి ఇరిగేషన్ పనులకు వేసిన అంచనా వ్యయాన్ని మాత్రమే భరిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది.


 రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత ఏపీదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినట్టు అయింది. ఇక ఈ డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: