టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరో గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాతో తానేంటో నిరూపించుకుంటూ ఒక స్టార్ గా ఎదిగాడు హీరో సత్యదేవ్. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగా తిమ్మరుసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ నేడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల కాగా, ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఇక తిమ్మరుసు సినిమాకు కిరాక్ పార్టీ దర్శకుడు శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం మూసిన కేసును రీ ఓపెన్ చేసిన లాయర్ పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఇక ఈ సినిమాలో టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ లీడ్ రోల్ చేస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో బ్రహ్మాజీ. అజయ్ నటించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: