సీబీసీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కు ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉంటూ హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖపై చర్యలు ప్రారంభమయ్యాయి. సీబీసీఐడీ ఏడీజీ పోస్టులో ఉన్న సునీల్ కుమార్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని గతంలో డీఓపీటీ శాఖకు రఘురామ ఫిర్యాదు చేశారు. అలాగే సునీల్ కుమార్ పై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే రఘురామ ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు రఘురామ చేసిన ఫిర్యాదుతో కదిలిన డీఓపీటీ శాఖ సునీల్ కుమార్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ రఘురామ రాసిన లేఖను కేంద్ర హోం శాఖకు డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఫార్వర్డ్ చేశారు. సునీల్ కుమార్ ఎక్కడైనా సర్వీస్ రూల్స్ బ్రేక్ చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకోవాలని సిఫార్స్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలావ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ లేఖలో ప్రస్తావించారు. ఇక కేంద్ర హోం శాఖ ఎంక్వైరీలో ఏం తేలుతుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: