తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. హుజూరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో గెలిచినట్టు గానే హుజూరాబాద్ లోనూ గెలవాలని కెసిఆర్ ఎత్తులు వేస్తున్నారు. దుబ్బాక ఎన్నికను తలదన్నేలా ఇక్కడ కూడా వందల కోట్లు ఖర్చు చేసి అయినా సరే గెలవాలని కెసిఆర్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 50 ఏళ్లు తానే ఏలాలని కెసిఆర్ అనుకుంటున్నాడు. 

కెసిఆర్ వచ్చాకనే ఓట్లు కొనుగోలు చేసే కొత్త ఒరవడి ఎన్నికలలో చోటు చేసుకుంది. అంతకు ముందు ఇలాంటి పద్ధతి లేదు. కెసిఆర్ ఈ ఒరవడిలో ఏకంగా గ్రాడ్యుయేట్ ఓట్లను కూడా కొనగలిగే ఈ స్థాయికి ఎదిగారు అంటూ ఆయనపై విమర్శలు గుప్పించారు. ఇక దుబ్బాక తర్వాత హుజూరాబాద్ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. రాజకీయ వర్గాల్లోనూ హుజురాబాద్ ఎన్నికల విషయం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: