అశ్లీల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. జూలై 27 మంగళవారంతో ఆయన పోలీస్ కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కాన్పూర్‌లోని రాజ్ కుంద్రాకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకోవాలని ముంబై క్రైమ్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు ధృవీకరించారు. ఈ రెండు బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ చేసినట్లు ఎస్‌బిఐ అధికారులు తెలిపారు. ఆదివారం బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్న తర్వాత రాజ్ కుంద్రాకు సంబంధించిన మరో కేసు వెలుగులోకి వచ్చింది. రాజ్ కుంద్రా నిర్మాణ సంస్థను అరవింద్ శ్రీవాస్తవ నడుపుతున్నారని, ఆ డబ్బును అరవింద్ శ్రీవాస్తవ భార్య హర్షితకు బదిలీ చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

శ్యామ్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అరవింద్ తండ్రి ఎన్.పి.శ్రీవాస్తవ మాట్లాడుతూ అరవింద్ గత రెండేళ్లుగా ఇంటికి రాలేదు. ఇంటి ఖర్చుల కోసం ఎప్పటికప్పుడు డబ్బు పంపుతున్నాడు. 2021 ఫిబ్రవరిలో ముంబై క్రైమ్ బ్రాంచ్ అరవింద్ శ్రీవాస్తవ కోసం లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు ఎన్‌పి శ్రీవాస్తవ తెలిపారు. అయితే అరవింద్ శ్రీవాస్తవ విషయంలో హర్షిత బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేయడం గురించి తనకు ఏమీ తెలియదని తండ్రి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: