నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో "అఖండ" చిత్రాన్ని చేస్తున్నారు. త్వరలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను ముగించి బాలయ్య తన 107వ చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ చిత్రం కోసం ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణ రావడమే ఆలస్యం. మరోవైపు సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికైన తమన్ తాజాగా పని మొదలు పెట్టేసారు. ఇది కచ్చితంగా 'ఫైర్ క్రాకర్' అవుతుందంటూ తమన్ బాలయ్య అభిమానులకు హామీ ఇచ్చాడు. ఈ ట్వీట్ లో తమన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ఉన్న పిక్ ను షేర్ చేసుకున్నారు. ఈ పిక్ చూస్తుంటే బాలయ్య కోసం తమన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టుగా అనిపిస్తోంది. నందమూరి అభిమానులు కూడా ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: