న‌యా ఫోక‌స్ : తీరం చెంత అభివృద్ధి నినాదం
కోవిడ్ కార‌ణంగా కొన్ని ప‌నులు నిలిచిన కార‌ణంగా వాటికో రూపం ఇచ్చేలా ఏపీ స‌ర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే కొన్ని కంపె నీల‌తో చ‌ర్చించి హార్బ‌ర్ల ఏర్పాటుపై చేప‌ట్టిన చ‌ర్చ‌ల‌ను ఓ కొలిక్కి తీసుకువ‌చ్చింది. ప‌బ్లిక్ ప్ర‌యివేటు భాగ‌స్వామ్యంతో ఏర్పాట‌య్యే ఈ ప‌నుల‌కు సంబంధించి నిర్మాణాత్మ‌క వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించాల‌ని యోచిస్తున్నారు సీఎం జ‌గ‌న్. ఏదేమైన‌ప్ప‌టికీ సంక్షేమంతో పాటు అభివృద్ధి అన్న నినాదంతో సీఎం జ‌గ‌న్ ఇప్పుడు కొత్త నిర్ణ‌యాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో హార్బ‌ర్ల అభి వృద్ధికి ఎప్ప‌టి నుంచో త‌న వ‌ద్ద ఉన్న ప్ర‌తిపాద‌న‌ల అమ‌లుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. భావ‌న పాడు మొద‌లుకొని కృష్ణ ప ట్నం దాకా త‌న‌దైన అభివృద్ధిని చూపి, ఆ కోవ‌లో మ‌త్స్య కారుల జీవ‌న స్థితిగ‌తులు మార్చి త‌ద్వారా శుభ సంకేతాలు ఇవ్వాల‌ని భావిస్తున్నా రు. ఈ నేప‌థ్యంలో అధికార యంత్రాగాన్ని స‌మాయ‌త్తం చేస్తూ ఇప్ప‌టిదాకా శంకు స్థాప‌న చేసిన హార్బ‌ర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇ వ్వాల‌ని దిశా నిర్దేశం చేశారు. ప‌నుల‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ వేగవంతం చేయ‌డం, ఆ ప్ర‌క్రియ‌లో ఏమైనా అవ‌రోధా లు ఉంటే తొల‌గించ‌డం వంటివి చేయాల‌ని  సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ఆదేశించారు. మొత్తం ఏడు ఫిషింగ్ హార్బ‌ర్లు, మూడు పోర్టుల నిర్మాణానికి సంబంధించి ప‌నులలో క‌ద‌లిక తీసుకురావ‌డ‌మే ప్ర‌ధానోద్దేశంగా ఇవాళ సీఎం, సీఎస్ కొన్ని సూచ‌న‌లు చేసి, హై లెవ‌ల్ క‌మిటీ స‌మావేశాన్ని ముగించారు... రాష్ట్ర రాజ‌ధానిలో..




మరింత సమాచారం తెలుసుకోండి: