పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆదివారం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 45 స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఎన్నికల్లో 25 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండా ఎగురవేసింది. ఇక పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 11 స్థానాల్లో గెలుపొంది. అంతేకాకుండా పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. 

ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీ మరియు జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ పార్టీ లకు చెరో స్థానం దక్కాయి. ఇక పీఓకే ప్రధానిగా సుల్తాన్ మహమ్మద్ ఎన్నిక కానున్నారు. ఇది ఇలా ఉండగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పిఓకేలో భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పీ ఓ కే ఎన్నికల ప్రక్రియలో కూడా ఇమ్రాన్ ఖాన్ పిటిఐ పార్టీ జోక్యం చేసుకున్నట్లు పలు నివేదికలు ఆరోపణలు చేయడంతో వేలాది మంది ప్రజలు పాకిస్తాన్ సైనికులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: