దేశంలో కరోనా కేసులు నమోదు విషయంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. కొన్ని రోజులు కేసులు పెరుగుతున్నాయి మరియు కొన్ని రోజులు అకస్మాత్తుగా తగ్గుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల కనిపించడం ఉపశమనం కలిగించే విషయం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సంఖ్య నాలుగు నెలల తర్వాత మొట్టమొదటి సరిగా కనిపించడం. తాజాగా ఒక రోజులో 30 వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు మార్చి 2021 లో మాత్రమే కొత్త కరోనా కేసులు ముప్పై వేల కన్నా తక్కువ నమోదయ్యాయి. 


అంటే ఒక రకంగా నాలుగు నెలల తరువాత ఈ కేసులు ముప్పై వేల లోపు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో మొత్తం 29 వేల 689 కొత్త కేసులు నమోదయ్యాయి, 415 మంది మరణించారు. అదే సమయంలో 42 వేల, 363 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ఇక దేశంలో రికవరీ రేటు 97.39 శాతానికి చేరుకుందని, ఇందులో 3,06,21,469 మంది రోగులు కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,98,100 మంది రోగులు కరోనా బారిన బాధపడుతున్నారు. అలాగే మొత్తం మరణాల సంఖ్య 4,21,382 కు చేరుకుంది. అదే సమయంలో ఇప్పటివరకు 44,19,12,395 మందికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: