తలపతి విజయ్ కు సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న స్టార్ హీరోల్లో విజయ్ ముందు వరుసలో ఉంటారు. ఇటీవల ఆయన నటిస్తున్న "బీస్ట్" చిత్రం విడుదల సమయంలో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. ఆ లుక్ సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చెన్నై సమీపంలోని విజయ్ ఇల్లు, అభిమాన సంఘం 'విజయ్ చీఫ్ పీపుల్స్ మూవ్మెంట్' కార్యాలయంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ ప్రధాన కార్యదర్శి పుస్సీ ఆనంద్ పాల్గొని అధ్యక్షత వహించారు. 



విజయ్ విగ్రహావిష్కరణ సమయంలో అక్కడికి చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడి పేరుతో నినాదాలు చేశారు. "మంగుళూరు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ విజయ్, గాడ్ విజయ్!, హ్యూమన్ గాడ్ విజయ్!, మన్నతిమన్నన్ విజయ్" అంటూ విజయ్ పై తమ ప్రేమను కురిపించారు. విగ్రహ సంస్థాపన కార్యక్రమానికి వందలాది మంది అభిమానులు హాజరయ్యారు. 'విజయ్ చీఫ్ పీపుల్స్ మూవ్మెంట్' తమిళనాడులో పలు సామాజిక, సహాయక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ప్రస్తుతం విజయ్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన 'బీస్ట్' చిత్రంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: