చిన్నప్పుడు చదివిన చందమామ కథలాంటిదే జీవితం.. రెక్కలు ఇస్తుంది..పరుగులు ఇస్తుంది..కలలు ఇస్తుంది..ఊహలు ఇస్తుంది ..అన్నీ ఇచ్చాక వాటి సాకారం కోసం కృషి చేయమని ఆదేశిస్తుంది..అలాంటిదే ఇప్పుడు నాసా నిజం చేయనుంది. డియర్ మూన్ కమింగ్ సూన్ .. త్వరలోనే మరో స్పేస్ టూర్ జరగనుంది.. దీని పేరు డియర్ మూన్ అని తేలింది.. ఇప్పటిదాకా స్పేస్ టూర్ కు సంబంధించి ఒక రికార్డు నెలకొల్పిన  వర్జిన్ గెలాక్టిక్ కూడా మరో స్పేస్ టూర్ కు సిద్ధం అవుతోంది.. అయితే ఈ డియర్ మూన్ ను మాత్రం జపాన్ చేపట్టనుంది అని తెలుస్తోంది. యుసాకు మేజావా అనే సంపన్నుడు చందమామ అందాలను తనివితీరా వీక్షించేం దుకు సిద్ధం అవుతున్నాడు.. ఇందుకు నాసా సాయం చేస్తోంది. మొత్తం ఎనిమి దితో సాగే ఈ ప్రయాణం ఖర్చులు తానే భరిస్తానని అయితే తనతో ప్రయాణించే వారిని తన వెబ్ సైట్ ద్వారా ఎంపిక చే సుకుంటానని చెప్పారు.. కానీ  ఇప్పుడు ఇది కూడా పూర్తిగా ఓపెన్ కావడం మానేసింది. యూజర్ ట్రాఫికింగ్ నెలకొనడం వల్లనేమో అన్నది కొందరి భావన. ఇక నాసా కూడా మరో స్పేస్ టూర్ ను ప్లాన్ చేస్తుంది సొంతంగా..యాక్స్ 1,యాక్స్  -2 పేరిట రెండు స్పేస్ రాకెట్ల రూపకల్పన పూర్తయింది.. మొదటి దాంట్లో ప్రయాణించే వారి టిక్కెట్లు కూడా బుక్ అయిపోయాయి. ఇలా ప్రపంచ స్థాయి కుబేరులంతా గగనపు వీధులలో నడయాడాలని ఉవ్విళ్లూరుతుండడం అందుకు కొన్ని ఏజెన్సీలు సై అంటుండడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: