కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజెక్టు శ్రీశైలం డ్యామ్. ఈ ఏడాది భారీగా వర్షాలు పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్యామ్ లు సైతం నిండుకుండలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యభాగమైన శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రతిసారి తెలంగాణ, ఆంధ్రా మినిస్టర్లు కలిసే గేట్లు ఓపెన్ చేసేవారు.


 గత కొంతకాలంగా ఇది ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి మాత్రం ఇరు రాష్ట్రాల మినిస్టర్స్ డ్యామ్ గేట్ల ఓపెనింగ్ కు వెళ్తారా ? లేదా ? అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. తెలంగాణ మినిస్టర్స్ ఈ విషయంపై ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉండడం ఈ అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి కొన్ని రోజుల నుంచి ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా తేలలేదు. రేపు ఏం జరగనుందో అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: