కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి శాసన సభా పక్ష నేత ఎవరు అనే దానిపై కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఎడ్యూరప్ప గత కొంతకాలంగా రాజీనామా చేస్తారని పుకార్ల మధ్య నిన్న సాయంత్రం ఆయన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. ఇక ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎవరు చేపడతారు ఏంటనే దానిపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. నేడు సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన తర్వాత సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కిషన్ రెడ్డి కొంతమంది బిజెపి సీనియర్ నేతలతో దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: