5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో దోషిగా చూపించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే పలు కీలక అంశాల మీద ఆయన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ని టార్గెట్ గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ కాస్త తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహంగా విమర్శలు చేసారు.

పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుంది అని ఆయన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో చర్చకు ఆసక్తి చూపకపోగా..కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించడం లేదు అని మండిపడ్డారు. కరోనా టీకా కార్యక్రమంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదు అని ఆగస్టు 15 తర్వాత బీజేపీ ఎంపీలంతా తమ నియోజవర్గాలకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: