నిన్న శ్రీశైలం డ్యాం కి సమీపంలో భూకంపం సంభవించడం కాస్త సంచలనం అయింది. దీనిపై ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త శ్రీ నగేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 55 ఏళ్ల తర్వాత శ్రీశైలం నల్లమల అడవుల్లో నిన్న భూకంపం సంభవించింది అని తెలిపారు. రిక్టర్ స్కేల్ మీద 3.7గా భూకంపం తీవ్రత నమోదయ్యింది అని వివరించారు. శ్రీశైలం డ్యాంకు 40 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.

భూమి పొరల్లో చీలికల వల్ల భూకంపం సంభవించిందన్నారు. శ్రీశైలం డ్యాం అధికారులను అప్రమత్తం చేశాం అని  ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆయన స్పష్టం చేసారు. అదే విధంగా  వారం రోజుల పాటు ఎన్జీఆర్ బృందంతో భూకంపం నమోదైన ప్రాంతంలో పూర్తిస్థాయిలో మానిటరింగ్ చేస్తాం అని ఆయన మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: