మంగళవారం రోజు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పై వైఎస్ జగన్  సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో పని తీరు బాగా లేని అధికారులకు మెమోలు సైతం జారీ చేయాలని వైస్ జగన్ ఆదేశాలు జారీ చేసారు. సమస్యలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం తప్పుపట్టారు జగన్.  ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజల వద్దకు వెళ్లాల్సిందే అంటూ సీఎం అధికారులను ప్రశ్నించారు. కలెక్టర్ల పని తీరు బాగున్నప్పటికే, అధికారుల తీరు మాత్రం ఆశాజనకంగా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి లో ఏదైనా తప్పులు జరిగితే, వాటిని అక్కడికక్కడే తగిన పరిష్కారం చూపే అవకాశం ఉన్న కారణంగా అలసత్వం వహించకుడంటూ ప్రశ్నిచారు వైస్ జగన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: