చత్తీస్ గడ్ కాంగ్రెస్ పార్టీలో సభ్యుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ డియో బంధువులు మరియు అతని అనుచరులు తనని చంపడానికి చూస్తున్నారని తనపై దాడికి యత్నించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బృహస్పతి సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అనంతరం బృహ‌స్ప‌తి డియో బంధువుల‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు ఇతర సెక్ష‌న్ ల కింద కేసులు న‌మోదు చేయించారు. కాగా కాంగ్రెస్ లో వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. 

అంతేకాకుండా పార్టీ లో గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. ఇక తాజాగా ఈరోజు చతిస్గడ్ హెల్త్ మినిస్టర్ డియో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బయటకు వెళ్లిపోయారు. ఈరోజు మధ్యాహ్నం టీఎస్ డియో బయటకు వెళ్లడంతో మరో ఇద్దరు మినిస్టర్లు ఆయనను లోపలికి రావాలని కోరారు. కానీ డియో మాత్రం వెనక్కి చూడకుండా అసెంబ్లీ నుండి బయటకు వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: