ఉత్తరాంధ్రలో కాస్త మంచి చరిత్ర కలిగిన మాన్సాస్ ట్రస్ట్ విషయంలో వైసీపీ నేతల జోక్యం ఇబ్బందికరంగా మారింది అనేది టీడీపీ నేతల మాట. రాజకీయంగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు మీద ఉన్న కోపాన్ని మాన్సాస్ లో తలదూర్చడం ద్వారా వైసీపీ తీర్చుకుంటుంది అనే కామెంట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటె ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. మాన్షస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోకగజపతి దాఖలు చేసిన వ్యాజ్యం పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్ట్.

ట్రస్ట్ సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ఈవో కి ఆదేశాలు ఇచ్చింది. ట్రస్ట్ అకౌంట్స్ సీజ్ చేయాలంటూ ఈఓ ఇచ్చిన ఆదేశాలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రస్ట్ కింద  ఉన్న ఇస్టిట్యూషన్స్ వ్యవహారం లో జోక్యం చేసుకోవద్దని ఈఓని కోర్ట్ ఆదేశించింది. పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈఓ ఇచ్చిన ప్రొసీడింగ్స్ సస్పెండ్ చేసింది.

స్టేట్ ఆడిట్ అధికారులు ఆడిట్ చేసుకోవచ్చు అని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఇక ట్రస్ట్ లో ఈవో... చైర్మన్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోర్ట్ ఆదేశించింది. కాగా మాన్సాస్ వ్యవహారంలో విజయసాయి తలదూర్చి ఆదేశాలు జారీ చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపధ్యంలో అశోక్... కోర్ట్ లో ఈ విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap