పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ కారణంగా అనాధలుగా మారిన వారి వివరాల నమోదులో అన్ని దొంగ లెక్కలే ఉన్నాయంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల స్వరాజ్ వెబ్ సైట్ లో అనాధల వివరాలు నమోదు ఎందుకు చేయలేదని పంజాబ్, పశ్చిమ బెంగాల్, జమ్ము కశ్మీర్ ప్రభుత్వాలను నిలదీసింది. అన్ని వివరాలు నమోదు చేశామని... అలాగే NCPCR కు పూర్తి డేటా పంపామన్న బెంగాల్ ప్రభుత్వ లాయర్ మాటలపై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మీ రాష్ట్రం మొత్తం మీద 27 మంది పిల్లలే అనాధలుగా ఉన్నారా... ఈ మాట మేము నమ్మాలా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెరిఫికేషన్ ఇంకా జరుగుతుందన్న న్యాయవాది మాటలను తప్పుబట్టిన ఉన్నత న్యాయస్థానం... బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దంటూ హెచ్చరించింది. ఎంత కాలం ఇలా సాగదీస్తారూ.. మీ వల్ల చిన్న పిల్లలు దిక్కులేకుండా పోవాలా.. అని అసహనం వ్యక్తం చేసింది. పంజాబ్ సర్కార్ తీరును కోర్టు ఎండగట్టింది. పిల్లలే మీ దగ్గరకు వచ్చి వివారాలు నమోదు చేసుకోవాలని అని ప్రశ్నించింది. కిందిస్థాయికి వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేయాల్సిన ప్రభుత్వాలదే అని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: