13 సంవత్సరాలు తన జీవితాన్ని, డబ్బును నియంత్రించిన కన్జర్వేటర్‌షిప్ నుంచి తన తండ్రిని తొలగించి, అతని స్థానంలో ప్రొఫెషనల్ అకౌంటెంట్‌ను నియమించాలని బ్రిట్నీ స్పియర్స్ కొత్త న్యాయవాది సోమవారం పిటిషన్ వేశారు. మాథ్యూ రోసెన్‌గార్ట్ లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో , ప్రస్తుత చట్టపరమైన కన్జర్వేటర్‌షిప్ “ సమర్థవంతంగా లేదని, అత్యంగ విషపూరితంగా ఉంది ” అని పేర్కొన్నారు. తన తండ్రి జేమ్స్ స్పియర్స్ స్థానంలో సిపిఎ జాసన్ రూబిన్‌ను పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఆస్తులకు కన్జర్వేటర్‌గా నియమించాలని ఆమె తరపున లాయర్ ప్రతిపాదించారు. అసలు ఈ కన్జర్వేటర్‌షిప్‌ అనే చట్టాన్ని పూర్తిగా అంతం చేయడానికి ప్రయత్నించే ముందు, మొదట "బ్రిట్నీ స్పియర్స్ ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్య ఆమె తండ్రిని కన్జర్వేటర్‌గా తొలగించడం" అని రోసెన్‌గార్ట్ దాఖలు పిటిషన్ లో చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: