కరోనా దాటికి దేశంలోనే అత్యంత పెద్ద రవాణా సంస్థ అయినా రైల్వే సైతం ఒడిడుకులు గురయ్యింది. ఆ పరిణామాలు ప్రజలపై తీవ్రంగా చూపాయి. . తెలంగాణలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు ఈరోజు నుంచి తగ్గనున్నాయి. తగిన ప్లాట్ ఫామ్ టికెట్ ధర నేటి నుంచి అమలు చేయనున్నారు, కరోనా కారణంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంపు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు కరోనా తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఇక సికింద్రాబాద్, హైదరాబాద్ ప్లాట్ ఫామ్ టికెట్ ధర కరోనా సమయంలో 50 రూపాయలకు పైగా ఉండగా, నేటి నుంచి అది 20 రూపాయలకు తగ్గించింది. ఇక చిన్న స్టేషన్స్ లో ఈ ధర 10 రూపాయలకు తగ్గించారు. ప్లాట్ ఫామ్ టికెట్ ను నేరుగా కౌంటర్ వద్ద, లేదా యూటీఎస్ యాప్, క్యూఆర్ స్కాన్ ద్వారా తీసుకోవచ్చునని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది


మరింత సమాచారం తెలుసుకోండి: