కర్ణాటక  బీజేపీ శాసనసభ పక్ష నాయకుడి ఎంపికకు ఇద్దరు పరిశీలకులను ఈరోజు సమావేశం అయిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమించింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ కిషన్ రెడ్డిని పరిశీలకులుగా నియామించారు. ఇక ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరారు. ఇక కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై నియమితులు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 


ప్రస్తుతం బసవరాజ్‌ బొమ్మై హోంమంత్రిగా ఉన్నారు. ఆయనది లింగాయత్‌ సామాజిక వర్గం. మాజీ సీఎం ఎస్‌.ఆర్‌.బొమ్మై కుమారుడే ఈ బసవరాజ్‌ బొమ్మై. బసవరాజ్‌ బొమ్మైను సీఎం చేయాలని యడియూరప్ప సూచించినట్టు తెలుస్తోంది. ఇక యడియూరప్ప సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఈయన కూడా కావడంతో ఆయన పేరును ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సాయంత్రమే బసవరాజ్‌ బొమ్మై పేరు ప్రకటించే అవకాశం ఎక్కువ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: