తెలంగాణ డిమాండ్ : మాకొక హుజూరాబాద్ కావాలి

డ‌బ్బులు పంచండి..నేరం..డ‌బ్బులు పంచ‌కండి..ధ‌ర్మం..కానీ ధ‌ర్మం తప్పితే నేరం..నేరం రుజువు అయితే శిక్ష. సాక్షి ఎవ్వ‌రు? ఈ క థ‌కు..నాయ‌కులు అదే ప‌నిగా త‌ప్పులు చేస్తూ పోతే ఈ త‌ప్పుల‌కు శిక్ష ఏమ‌ని విధిస్తారు..కోర్టులు మాట్లాడి ఈ ధ‌న ప్ర‌వాహానికి అ డ్డుక‌ట్ట వేస్తే బాగుండు. కానీ కోర్టులెందుకో మాట్లాడ‌వు. 

బై పోల్ ఖ‌ర్చు ఎంతో తేలిపోయింది..కానీ క‌ట్ట‌డి మాత్రం లేదు.ద‌ళిత బంధు ప‌థకానికే 1200కోట్లు కావాల‌ని అంటున్నారు. ఇక మి గ‌తా ప‌నుల‌కూ పంపకాల‌కూ ఎంత అవుతుందో తెలియ‌దు..డ‌బ్బంతా హుజూరాబాద్ కే కేటాయిస్తే తెలంగాణ‌లో మిగిలిన జిల్లాల క థ ఏమ‌వ్వాలి?ఈ ఎన్నిక నిజంగానే టీఆర్ఎస్ ఉనికిని ప్ర‌శ్నించేదేనా? అని ఓ డైల‌మా అంద‌రిలోనూ ఉంది. కేవ‌లం ఇదొక పొలిటిక ల్ స్ట్రాట‌జీ అనుకుని ఖ‌ర్చు చేస్తే రేప‌టి వేళ సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఎంత ఖ‌ర్చు చేయాలి..అప్పుడు నిధులు ఎక్క‌డి నుంచి తేవాలి  అన్న విష‌య‌మై నాయ‌కులంతా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నా రు.ఇప్ప‌టికి ప్పుడు మంత్రులూ,ఎమ్మెల్యేలూ అక్క‌డే పాగా వేసి ప‌నులు చేయిస్తున్నార‌ని స‌మాచారం. అదే ఊపూ, ఉత్సాహం తెలంగాణ అంతంటా అందించే సోయి నాయ‌కుల‌కు లేదా అని మ‌రికొంద‌రు ఆగ‌మాగం అవుతున్నారు..గుస్సా అయితున్న‌రు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr