భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌ టోక్యో ఒలింపిక్స్‌కు సకాలంలో చేరుకోలేకపోయింది. ప్రస్తుతం ఫ్రాంక్‌ఫర్ట్ లో ఉన్న ఆమె వీసా కారణంగా టోక్యో ఒలిపింక్స్ కు చేరుకోలేకపోయింది. ఆమె ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉండాల్సిన గడువు కన్నా ఒక రోజు ఎక్కువ ఉండటం కారణంగా అక్కడి నుంచి టోక్యో చేరుకోలేకపోయింది. వీసా గడువు తీరడంతో ఆమె విమాన ప్రయాణానికి ఫ్రాంక్‌ఫర్ట్ అధికారులు అంగీకరించలేదు.


ఆ తర్వాత సమస్యను ఇండియన్ ఎంబసీ దృష్టి కి తీసుకెళ్లడంతో ఆమె వీసాను మరో రోజుకు పొడిగిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వినేశ్ ఫోగట్ ఇవాళ టోక్యో చేరుకుంటుందని భావిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ కోసం ఆమె హంగరీలో కోచ్‌ ఓలర్ అకోస్‌ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో 54 కేజీల విభాగంతో పోటీపడుతోంది. ఈసారి వినేశ్ ఫోగాట్ ఇండియాకు పతకం తెస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: