ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో జాతీయ విద్యా విధానం (5+3+3+4) అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మొదట రాష్ట్రంలోని 1460 పాఠశాలలో జాతీయ విద్యా విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దానికోసం ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలతో పాటు పక్క పక్కనే ఉన్న బడుల నుండి మూడవ నాల్గవ ఐదవ తరగతులను ఉన్నత పాఠశాలలో కలపనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గా మొత్తం 939 ఎలిమెంటరీ పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండగా 521 పక్క పక్కనే ఉన్న పాఠశాలల్లో జాతీయ విద్యా విధానం అమలు చేయబోతున్నారు. ఆ తర్వాత ఇతర పాఠశాలలను కూడా ఈ విధానం లోకే మారుస్తారు. ఈ విధానం అమలు చేయడం ద్వారా ఒకే ప్రాంగణంలో ఇంటర్ విద్య కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ విధానం ఉత్తరాదిన ఉన్న చాలా రాష్ట్రాల్లో అమలవుతోంది. ఇప్పుడు ఏపీలోనూ ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: