భారీ వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడి రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా భారీ వర్షాలకు జమ్ము కశ్మీర్ చిగురుటాకులా వణుకుతోంది. రాష్ట్రంలో నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కిష్టివార్ జిల్లాలోని ఓ గ్రామంలో కొండ చరియలు విరిగిపడి 20 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. మరో 40 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. కేంద్ర బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా జమ్ము తరలిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. మరో వారం రోజులు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: