మాజీ సీబీఐ అధికారి రాకేష్ ఆస్థానాను ఢిల్లీ కమిషనర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆస్థాన ఢిల్లీ కమిషనర్ గా కొనసాగుతారని ప్రకటించింది. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం ఆస్థాన సిబిఐ డైరెక్టర్ రేసులో ఉన్నారు. కానీ జూలై 31న ఆస్థాన రిటైర్మెంట్ ఉండడంతో రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను పోలీస్ శాఖకు సంబంధించిన విధుల్లోకి తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ... హోం మంత్రి అమిత్ షా తో స్పెషల్ కేస్ పేరుతో ఆస్థాన కు  ఢిల్లీ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మళ్లీ ఢిల్లీలో రైతుల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ మరియు మంత్రి శాఖా మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రైతుల ఆందోళనలు తీవ్రతరం అవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: