మృత్యు తీవ్ర‌త‌లు ఈ క‌రోనా పెంచింది..మృత్యు గీతాలు విని విని నిరాశ‌లు నింపి వెళ్లింది. మ‌ళ్లీ క‌రోనా అలాంటి ఉత్పాత‌మో, విల య‌మో తీసుకువచ్చింది. దేశంలో క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణాల సంఖ్య ఊహించ‌ని రీతిలో పెరుగుతున్నందున ఇప్పుడు మ‌ళ్లీ భ యాల తీవ్ర‌త‌లూ పెర‌గ‌నున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌శాంతంగా కాలం నెట్టుకువ‌స్తున్న భార‌తావ‌నికి ఈ వార్త క‌ల‌వ‌ర‌పాటే! క‌రోనా నియంత్ర‌ణ‌లో యంత్రాంగం చేస్తున్న కృషి ఓ మేర‌కు సఫ‌లం అయిన విధంగానే ఉన్నా, ఇప్పుడు వారి స్థైర్యాన్నీ, న‌మ్మ‌కా న్నీ త‌గ్గించేలా ప‌రిణామాలు నెల‌కొన‌డం విచార‌క‌రం. కొత్త‌గా న‌ల‌భై మూడు వేల కేసులు, న‌ల‌భై ఒక్క వేల మ‌ర‌ణాలు వైర‌స్ తీవ్ర త‌కు తార్కాణం ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా స్వీయ జాగ్ర‌త్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ, త‌మ త‌మ దైనందిన కార్య‌క‌లాపా లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం కోరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: