ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా కేరళ ,మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. కేరళలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ లో ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అంతే కాకుండా కరోనా కట్టడికి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టులో థర్డ్ వేవ్ వస్తుందనే నిపుణుల హెచ్చరికలపై కూడా కేబినెట్ చర్చించనుంది. దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ మరింత వేగం పెంచడం పై కూడా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటు ఇతర అంశాలపై కూడా చర్చ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: