టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఉమాను అక్రమంగా అరెస్ట్ చేసారని ఆరోపిస్తూ నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఉమాను విడుదల చేయాలంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉమాను మాకు చూపించాలని పోలీస్ స్టేషన్ సిబ్బందిని నిలదీస్తున్నారు.

దీనితో పోలీస్ స్టేషన్ వద్ద భారీగా బలగాలను మొహరించారు. ఇక ఇదిలా ఉంటె దేవినేని ఉమాపై రెండు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసారు పోలీసులు. ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, 307 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం. నందివాడ వైపు వెళ్ళే వాహనాలు అన్నింటిని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా గ్రామంలోకి వెళ్ళే వాహనాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

uma