మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి సిబిఐ విచారణ ఏ మలుపు తిరగాబ్తుంది ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ వివేకా హత్యకే సు విచారణ ను వేగవంతం చేసిన సిబిఐ  బృందం.. పలువురు కీలక వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని విచారణ చేస్తుంది. ఈ నేపధ్యంలో వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ఎవ్వరిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో అని అనుమానితుల్లో టెన్షన్ టెన్షన్ గా ఉందని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. అర్ధరాత్రి నుండి పులివెందుల ప్రాంతంలో సిబిఐ  బృందం తిరగడం సంచలనం అయింది. పులివెందుల్లో కీలక అనుమానితుడు సునీల్ బందువు యువరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సిబిఐ  బృందం... అతన్ని కూడా విచారిస్తుంది. త్వరలోనే మరికొంతమందిని విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: