హైదరాబాద్ లో డ్రంక్అండ్ డ్రైవ్ విషయంలో పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో ఎన్ని కేసులు నమోదు చేసారు అనే దానిపై పోలీసులు లెక్కలు విడుదల చేసారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 353 మందికి జైలు శిక్ష విధించామని తెలిపారు. డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, కోర్టుల్లో అభియోగాలను నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

డ్రంక్అండ్ డ్రైవ్ విషయంలో   విచారణ జరిపిన కోర్టు ఇటీవల 353 మందికి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను ఖరారు  చేసిందని  కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పీఎస్‌లో 79, మియాపూర్‌- 60, మాదాపూర్‌- 41, బాలానగర్‌-49, రాజేంద్రనగర్‌-30, శంషాబాద్‌-24, గచ్చిబౌలి-50 మంది మందుబాబులకు జైలు శిక్ష పడింది అని పోలీసులు  పేర్కొన్నారు.  డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌కు సంబంధించి ఆర్‌టీఓ అధికారులకు  పోలీసులు లేఖలు రాసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts