టోక్యో ఒలంపిక్స్ ఐదో రోజుకు చేరుకున్నాయి. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది టోక్యో ఒలంపిక్స్ ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. అంతేకాకుండా కఠినమైన నిబంధనల మధ్య ఈ ఏడాదిలో ఒలంపిక్ క్రీడలు జరుగుతున్నాయి. దానికోసం ముందుగానే క్రీడాకారులు అందరికీ కరోనా పరీక్షలు చేశారు. ఇక తాజా టోక్యో ఒలంపిక్స్ అప్డేట్స్ చూసినట్లయితే....బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు చేంగ్ నాన్ యినిని ఓడించి మహిళల సింగిల్స్ లో 16వ రౌండ్ కు చేరుకుంది.

మరోవైపు హాకీ మహిళల జట్టు గ్రేట్ బ్రిటన్ చేతిలో భారత క్రీడాకారులు 1-4 తేడాతో ఓడిపోయారు. దాంతో ఇప్పటివరకు హాకీ మహిళల  జట్టు వరుసగా మూడు సార్లు ఓటమిపాలైంది. ఇక విలువిద్య పోటీల్లో పురుషుల వ్యక్తిగత రౌండ్  32 లో తరుణ్ దీప్ రాయ్ ఓటమిపాలయ్యాడు. ప్రవీణ్ యాదవ్ 32 వ రౌండ్ లో ప్రపంచ నంబర్ వన్ ఎల్లిసన్ చేతిలో ఓడిపోయాడు. రోయింగ్ క్రీడలో భారత్ కు చెందిన అరవింద్ సింగ్, అర్జున్ పాల్ కూడా పథకాలు గెలుచుకునే అవకాశం కోల్పోయారు. పురుషుల లైట్ వెయిట్ డబల్ స్కల్స్ సెమీఫైనల్ లో ఆరో స్థానంలో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: