టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒక గొప్ప పని చేశారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి కోసం యువరాజ్ సింగ్ రూ 2.5 కోట్లు ఖర్చు చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 120 ఐసియు పడగలను యువరాజ్ సింగ్ ఈ డబ్బుతో ఏర్పాటు చేశాడు. ఇక ఈ ఐసీయూ బెడ్లను కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించగా యువరాజ్ సింగ్ వర్చువల్ గా పాల్గొన్నాడు. కరోనా చాలా మంది ప్రజల జీవితాలలో చీకటిని నింపింది అని... అలాంటి విపత్కర పరిస్థితులు థర్డ్ వేవ్ లో రాకూడదనే తన పౌండేషన్ తో బెడ్లను ఏర్పాటు చేస్తున్నట్టు యువరాజ్ సింగ్ ప్రకటించారు.

ఇది ఇలా ఉండగా యువరాజ్ సింగ్ తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఇప్పటివరకూ చేపట్టారు. అంతేకాకుండా తెలుగు వారితో యువరాజ్ సింగ్ కు ఒక ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది. ఇటీవల యువరాజ్ సింగ్ టాలీవుడ్ హీరో బాలకృష్ణ పుట్టినరోజుకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో సదుపాయాల కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: