ప్రజా ప్రతినిధుల కేసులకి సంబంధించి సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధుల కోర్ట్ దూకుడుగా విచారణ జరుపుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణా ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు రైల్ రోకో కి సంబంధించి 3 వేల జరిమానా కూడా కోర్ట్ విధించింది. ఇటీవల ఎంపీ కవిత విషయంలో కోర్ట్ తీర్పు ఇచ్చింది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టులో ఊరట లభించింది.

ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాడి కేసులో దానంకు ఇటీవల 6 నెలల జైలు శిక్ష విధించింది ప్రజా ప్రతినిధుల కోర్ట్. ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు తీర్పుపై హైకోర్టులో దానం నాగేందర్ పిటీషన్ దాఖలు చేసారు. విచారణ ఆగస్టు 23కి తెలంగాణా హైకోర్ట్ వాయిదా వేసింది. పలు కేసులకు సంబంధించి త్వరలో తీర్పులు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs