అక్కినేని యంగ్ హీరో రెండో పెళ్ళికి సిద్ధమైన విషయం ఈ రోజు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. ఈ హీరో పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డు తో పాటు పలు సోషల్ మీడియా సైట్లలో వార్తలు వైరల్ అయ్యాయి. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ రెండో వివాహానికి సిద్ధమైనట్టు శుభలేఖలు చూస్తే అర్థమవుతుంది. 

అయితే సుమంత్ పెళ్లి పై తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "ఒకసారి అయ్యాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా సుమంత్? నీ కర్మ, ఆ పవిత్ర కర్మ... అనుభవించండి. ఒక పెళ్లి నూరేళ్లపంట పెంట అయితే, రెండో పెళ్లి ఏంటయ్యా స్వామి? నా మాట విని మానెయ్. పవిత్ర గారు మీ జీవితాలను పాడు చేసుకోకండి. తప్పు మీది సుమంత్ ది కాదు. తప్పు దౌర్భాగ్యపు వ్యవస్థది" అంటూ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: