కరోనా మహమ్మారి వల్ల మూతబడ్డ థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పలు మీడియం బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తిమ్మరసు, ఇష్క్, ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి చిత్రాలు రానున్న రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతున్నాయి. కానీ ఆంధ్రాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అక్కడ థియేటర్లు తెరుచుకుంటాయా లేదా అనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీ, రోజుకు మూడు ఆటలతో కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ థియేటర్లను తెరుచుకోవచ్చని అనుమతినిచ్చింది. ఇవే కాకుండా టికెట్ రేట్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఇంకా అక్కడ థియేటర్ల రిఓపెన్ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ శుక్రవారం పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా... ఏపీలోని అన్ని జిల్లాల ఎగ్జిబిటర్స్ విజయవాడలో సమావేశమైనట్టు తెలుస్తోంది. థియేటర్స్ రీఓపెనింగ్, టికెట్ రేట్ల సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారట. మరి వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: