హైదరాబాద్‌లో ప్రాంక్ వీడియో చేయాలన్న ఓ యూట్యూబ్ చానల్ యాంకర్‌ను షాపు యజమాని కుమ్మేశాడు.. ప్రాంక్ వీడియో చేసేందుకు ఆ యాంకర్ హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్ లో చేసిన ప్రయత్నం వికటించింది. ప్రాంక్ వీడియో చేద్దామని ఓ యూట్యూబ్ చానల్ యాంకర్ జగదీశ్ మార్కెట్‌లోని ఓ మొబైల్ షాపుకు వెళ్లాడు.


ప్రాంక్ వీడియో కోసం కావాలనే గొడవకు దిగాడు. అయితే.. గొడవ పెద్దగా కావడంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని సదరు యాంకర్ ని చితకబాదాడు. ఇది ప్రాంక్ వీడియో అని చెప్పినా వినకుండా పిడి గుద్దులు గుద్దేశాడు జగదీష్ మార్కెట్ లోని ఆ మొబైల్ షాప్ యజమాని. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు. తరచూ ప్రాంక్ వీడియోల పేరుతో కొందరు చేస్తున్న అతికి ఇలాగే జరగాలంటూ స్థానికులు కామెంట్ చేయడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: