రోజురోజుకూ కొత్త తరహా సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి. జనంలోకి ఆశను క్యాష్ చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు కొత్త అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. తాజాగా తక్కువకే ఫర్నిచర్ వస్తున్నాయన్న ఆశతో ఒకరు 30 వేల రూపాయల వరకూ మోసపోయారు. జీడిమెట్ల పరిధి గణేష్ నగర్ కు చెందిన నరేష్(33)..  ఫేస్ బుక్ లో ప్రకటన చూసి రూ.30,000 మోసపోయాడు.


ఫేస్ బుక్ లో తక్కువ ధరకే సోఫా, టీవీ, వాషింగ్ మెషిన్ అమ్ముతామన్న ప్రకటన చూశాడు. తక్కువ ధరకే అన్ని వస్తువులు వస్తున్నాయి కదా అని వాటిని సొంతం చేసుకుందామని ఫోన్ చేశాడు. సైబర్ నేరగాడు ముందు కొంత డబ్బు చెల్లించాలన్నాడు. తానో ఆర్మీ ఉద్యోగిని తనకు ట్రాన్స్‌ఫర్ అయిందని.. వస్తువులు తీసుకెళ్లలేక అమ్మేస్తున్నానని నమ్మబలికాడు. విడతలు విడతలుగా రూ. 30,000 అకౌంట్లో వేయించుకున్నాక.. ఇక ఫోన్ ఎత్తడం ఆపేశాడు. సైబర్ నేరగాడు ఎంతకూ స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: