టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మెడల్ దిశగా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది పీవీ సింధు. గ్రూప్ జే లో జరిగిన రెండు మ్యాచ్ లను సునాయాసంగా గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరిన తెలుగు తేజం.... అక్కడ కూడా వార్ వన్ సైడ్ అనేలా చెలరేగింది. డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ తో జరిగిన మ్యాచ్ లో సింధు.. 21-15, 21-13 తేడాతో గెలిచి క్వార్టర్ బెర్త్ ఖరారు చేసుకుంది. మొత్తం 41 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో బలమైన ఏస్ లతో చెలరేగిన తెలుగు తేజం... ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలిసెట్ లో హోరాహోరీ పోటీ జరిగినప్పటికీ...సర్వీస్ బ్రేక్ లతో పీవీ సింధు విజయం సాధించింది. రెండో సెట్లో డెన్మార్క్ షట్లర్ దూకుడు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ... సింధు దూకుడు ముందు పెద్దగా నిలవలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో ప్రస్తుతం సింధు మాత్రమే భారత ఏకైక ఆశాకిరణం. మిగిలిన అన్ని విభాగాల్లో కూడా భారత షట్లర్లు ఓడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: