రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా.. పెట్టుబడుల మాస్టర్‌ మైండ్‌.. ఈయన ఓ సంస్థలో పెట్టుబడి పెట్టాడంటే.. ఆ సంస్థకు మహర్దశ పట్టినట్టే.. ఆయన ఎంపిక అలా ఉంటుంది మరి. అలాంటి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇప్పుడు ఓ విమాన సంస్థను స్థాపించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తక్కువ ధర కలిగిన 70 విమానాలతో విమాన సంస్థను రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా స్థాపించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన 35 మిలియన్ డాలర్లతో ఈ సంస్థ స్థాపించ బోతున్నారట.


ఆకాశ ఎయిర్ పేరుతో నెలకొల్పబోతున్న ఈ సంస్థ చిన్నస్థాయి విమానాలతో సేవలందిస్తారట. ఈ విమానాల్లో 180 మంది ప్రయాణిస్తారట. భారత విమాన రంగంలో జోష్ తెప్పించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్టు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా చెబుతున్నారు. ఈ సంస్థలో తాను 40 శాతం వరకూ వాటా కలిగి ఉంటానని.. ఆయన చెబుతున్నారు. అయితే దేశంలో విమాన సంస్థలన్నీ దివాలా దిశగా పయనిస్తున్న వేళ రాకేశ్ తీసుకున్న ఈ నిర్ణయం సాహసమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: