తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు సీజన్లలో నాలుగో సీజన్ కు అత్యంత ఆదరణ లభించింది. కరోనా టైంలోనే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. దాంతో ఇంట్లోకి వెళ్ళే సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి హౌస్ లో కి పంపించారు. అంతే కాకుండా కఠిన నిబంధనల మధ్య బిగ్ బాస్ కొనసాగించారు. అయితే నాలుగో సీజన్ లో సోషల్ మీడియా సెలబ్రిటీలు సీరియల్ నటి నటులు ఎక్కువగా కనిపించారు.

అంతేకాకుండా కూడా ముందు ప్రజలకు పెద్దగా పరిచయం లేని వారిని తీసుకొచ్చి బిగ్ బాస్ 4 షోలో చూపించారు. అయితే 4వ సీజన్ సక్సెస్ అవ్వడం తో పాటు గత సీజన్లకు రాని రేటింగ్ వచ్చింది. దాంతో బిగ్ బాస్ సీజన్ 5 గ్యాప్ లేకుండా ప్రారంభించాలని నిర్వాహకులు భావించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 5 నుండి సీజన్ 5 ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ షోలో హోస్ట్ గా నాగార్జున కొనసాగుతారా లేదా అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి ఈసారైనా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకులకు పరిచయం ఉన్న సెలబ్రిటీలను తీసుకు వస్తారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: