దేశంలో కరోనా ఉధృతి మళ్లీ ప్రారంభమైంది. నిన్న మొన్న‌టి వరకు 20 నుంచి 30 వేల‌ మధ్యలో ఉన్న కేసులు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి పోతున్నాయి. ఈ రోజు దేశంలో 43,509 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 38,465 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.8 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా కేసులు పెరగడమే ఇప్పుడు చర్చగా మారింది. 

ఆగస్టులో కరోనా థ‌ర్డ్ వేవ్ వస్తుందని ఇప్పటికే వైద్య నిపుణులు ప్ర‌పంచ ఆరోగ్య‌శాఖ ప్రతినిధులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసులు పెరగటం అనేది థ‌ర్డ్ వేవ్ ఎఫెక్టే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు. సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ జిమ్ లు అన్నీ తెరుచుకున్నాయి. దాంతో ప్ర‌జ‌లు కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించడం మర్చిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: