కరోనా కేసులు భారీగా నమోదవుతున్న కారణంగా మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో కేరళ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 31, ఆగస్టు 1వ తేదీల్లో కేరళలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కేరళలో మళ్ళీ 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

 కేరళ లో కరోనా కేసులు పెరుగుతున్నందున వీకెండ్ లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారని. అలా చేస్తే కొంతమేరకైనా కేసులు తగ్గుదల పట్టే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి కేరళలో కాస్త కేసులు తగ్గుదల పట్టినా బక్రీద్ కారణంగా మూడు రోజుల పాటు పూర్తిగా సడలింపులు ఇచ్చారు. బహుశా ఆ సమయంలో కరోనా కేసులు భారీగా పెరిగి ఉండొచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారం అయితే ఇంకా ఏమీ లభించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: